Health tips Telugu

Read Previous post!
Read Next post!
Reading Time: < 1 minute

పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలో మనలో చాలా మందికి తెలిసిన విషయమే.ముఖ్యంగా గుండె జబ్బులు,మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి.అందువల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది

కరివేపాకు ప్రతి రోజు పరగడుపున ఐదు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి.ఆకులను తినలేని వారు కరివేపాకు పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు –
ఆలా కూడా త్రాగలేని వారు కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో కలుపుకొని తినవచ్చు.ఏ విధంగా తిన్నా ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండా తినాలి.

త్రిఫల పొడి ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన పొడిని త్రిఫల పొడి అని అంటారు.ఈ పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది.ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో త్రిఫల పొడిని కలుపుకొని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది

మెంతుల పొడి ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడిని కలిపి ఉదయం,సాయంత్రం క్రమం తప్పకుండా త్రాగితే కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు.దాంతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది., 04:01, Sent

Read Previous post!
Read Next post!