పరగడుపున ఒకటి తింటే ఏమి జరుగుతుందో తెలుసా….అద్భుతాలు జరుగుతాయి

Read Previous post!
Read Next post!
Reading Time: < 1 minute

అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు.అరటిపండులో చాల రకాలు ఉన్నాయి.చెక్కరకేళి,దేశవాళీ,బొంత,కర్పూర,పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి ఇలా అనేక రకాలు ఉన్నాయి.వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, మన శరీరంలో రక్తం సరిగ్గా ఉండాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ ఉంటారు.అరటి పండులో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు.

మాములుగా అన్ని పండ్ల వలెనె తెచ్చుకొని తింటూ ఉంటారు.ఇప్పుడు అరటిపండు మన శరీరానికి చేసే మేలును తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై బై చెప్పేయవచ్చు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒకటి,మధ్యాహ్నం భోజనంలో ఒక అరటి పండు, రాత్రి డిన్నర్ సమయంలో ఒక అరటి పండు క్రమం తప్పకుండా తింటూ ఉంటె చాలా మేలు చేస్తాయి.

ఈ విధంగా అరటిపండ్లను తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.కాబట్టి ప్రతి రోజు మూడు అరటిపండ్లను తిని గుండె జబ్బులను తరిమికొట్టండి.

అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు.ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి.

వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది.

జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.

అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటిపండును తిని ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.

Read Previous post!
Read Next post!